మహేష్ అబ్బురపరిచే ఫీట్.. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు

మహేష్ అబ్బురపరిచే ఫీట్.. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు
x
ThisHappened2019
Highlights

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. వరుస విజయాలతో మహేష్ బాబు

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. వరుస విజయాలతో మహేష్ బాబు ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ ఓ అబ్బురపరిచే ఫీట్ ని సాధించాడు. 2019 సంవత్సరానికి గాను భారతదేశంలో టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టును ప్రకటించింది ట్విట్టర్. ఇందులో టాలీవుడ్ నుంచి మహేష్ ఒక్కడే స్థానం సంపాదించాడు.

#ThisHappened2019 హాష్ ట్యాగ్‌తో ఈ టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ మేల్ లిస్టును వదిలింది ట్విట్టర్.. ఇందలో అమితాబ్ మొదటిస్థానంలో ఉండగా, అక్షయ్ కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో మహేష్ నిలిచి టాలీవుడ్ నుంచి సరిలేరు నీకెవ్వరు అని అనిపించుకున్నాడు. ఈ వార్త మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహన్ని నింపింది.

ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో మహేష్ బాబుకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories