మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే.. నేను వేరే అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా

మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే.. నేను వేరే అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా
x
జై, అంజలి
Highlights

సినిమా ఇండస్ట్రీలో రూమర్లు ఎక్కువ.. అందులోనూ హీరోహీరోయిన్స్ పైన అయితే మరి ఎక్కువ..

సినిమా ఇండస్ట్రీలో రూమర్లు ఎక్కువ.. అందులోనూ హీరో హీరోయిన్స్ పైన అయితే మరి ఎక్కువ.. వరుసగా ఓ రెండు, మూడు సినిమాలు చేస్తే చాలు వారి మధ్య ఎదో ఉందన్న గుసగుసలు వినిపిస్తాయి. ఈ రూమర్లు పైన వారు స్పందిచేవరకు అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. అందులో భాగంగానే నటుడు జై, అంజలిలు ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి.

'ఎంగేయుం ఎప్పోదుం' సినిమా నుంచి వీరి మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. ప్రేమ మాత్రమే కాదు పెళ్లి కూడా చేసుకునున్నారు కూడా ప్రచారం జరిగింది.. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్‌లో 'బలూన్‌' చిత్రం విడుదలయ్యేటప్పుడు.. వీరి పెళ్లి వార్తలు మరింత ఎక్కువగా వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారని వదంతులు పుట్టుకొచ్చాయి. కానీ వీటిపైన ఇటు అంజలి కానీ అటు జై కానీ స్పందించలేదు.

తాజాగా హీరో జై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జై మాట్లాడుతూ'.. 'మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే.. ఇద్దరం ప్రేమించుకున్నట్లు, పెళ్లి చేసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవాలు లేవు. నేను వేరే అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నానని జై వెల్లడించాడు. హీరో జై చెప్పిన సమాధానంతో అయిన వీరిపైన వస్తున్న రూమర్స్ కి చెక్ పడినట్టు అయిందని అనుకుంటున్నారు నెటిజన్లు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories