Top
logo

లాక్‌డౌన్ నేపథ్యంలో 1000కి పైగా పేద కుటుంబాల‌కు హీరో గోపీచంద్ సాయం

లాక్‌డౌన్ నేపథ్యంలో 1000కి పైగా పేద కుటుంబాల‌కు హీరో గోపీచంద్ సాయం
Highlights

కరోనా వైరస్‌ పై పోరాటానికి ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. లాక్‌ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన...

కరోనా వైరస్‌ పై పోరాటానికి ప్రభుత్వానికి పలువురు అండగా నిలుస్తున్నారు. లాక్‌ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు వారికి తమ వంతు సాయం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా కారణంగా పనులు లేకుండా పోయిన పేదలకు హీరో గోపీచంద్ తన వంతు సాయం అందించారు. దాదాపు వెయ్యికి పైగా కుటుంబాలకు ఒకనెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసారు. ఆయనే స్వయంగా వీటిని పేదలకు అందించారు. కరోనాపై పోరాటంలో తనకు తోచిన విధంగా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.Web Titlehero Gopichand donated daily needs for 1000 poor families
Next Story