Top
logo

ఆగిపోయిన విజయ్ దేవరకొండ 'హీరో'

ఆగిపోయిన విజయ్ దేవరకొండ
Highlights

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' ...

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓనమాలు ఫేం క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా నటించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.. దీనితో విజయ్ ఖాతాలో మరో ప్లాప్ గా చేరిపోయింది.

అయితే ఇప్పుడు విజయ్ కి మరో షాక్ తగిలింది.`డియ‌ర్ కామ్రేడ్` సినిమా చేస్తున్న సమయంలో మైత్రీ మూవీమేక‌ర్స్‌కి రెండు చిత్రాల కోసం అగ్రిమెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.. డియ‌ర్ కామ్రేడ్ సినిమా తర్వాత అదే సంస్థలో `హీరో` చిత్రాన్ని మొద‌లుపెట్టాడు విజయ్... దీనికి త‌మిళ ద‌ర్శకుడు ఆనంద్ అన్నామ‌లై దర్శకుడు..మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది‌. అయితే కొంత భాగం షూటింగ్ చేశారు. కానీ అవుట్‌పుట్ మాత్రం అనుకున్న స్థాయిలో లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన మైత్రీ వారు సినిమాని అర్థాంత‌రంగా ఆపేశార‌ట‌. ఇప్పటికే ఈ సినిమా కోసం 5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. ఈ సినిమా స్థానంలో మైత్రీ వారికి విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో సినిమా చేయ‌నున్నాడని సమాచారం!

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండేను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత దివంగత హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌తో చిత్ర బృందం చర్చలు జరిపినప్పటికీ కుదరలేదు. దీంతో చివరికి అనన్య పాండేను ఎంపిక చేసింది.

Web TitleHero film shelved for This reason reports
Next Story


లైవ్ టీవి