అల్లు అర్జున్ కోటి 25 లక్షల విరాళం.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా..

అల్లు అర్జున్ కోటి 25 లక్షల విరాళం.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా..
x
Allu Arjun
Highlights

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే .

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్న సంగతి తెలిసిందే . అయితే ప్రభుత్వానికి తోడుగా టాలీవుడ్ సినీ ప్రముఖులు సహాయం చేస్తూ.. తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలను, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. హీరో మహేష్ బాబు, ప్రభాస్ కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల, ఎన్టీఆర్ 75 లక్షల రూపాయలను అందజేశారు.

ఒక తాజాగా ఈ లిస్ట్ లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేరళకు కూడా అందజేయనున్నట్లు బన్నీ ప్రకటించాడు.

"చాలా మంది జీవితాలను కరోనా వైరస్ దెబ్బతీసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మానవత్వం కలిగిన మనిషిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ప్రజలకు కలిపి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నాను. మనందరి కలిసి పోరాడి, ఈ మహమ్మారిని త్వరలోనే నిర్మూలిస్తామని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా" అని తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొన్నాడు. ఇక దర్శకుడు సుకుమార్ రెండు రాష్ట్రాలకు కలిపి పది లక్షలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories