శ్రీముఖి పై హేమ కామెంట్స్..

శ్రీముఖి పై హేమ కామెంట్స్..
x
Highlights

జూలై 21న మొదలైన బిగ్ బాస్ థర్డ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మొత్తం 17 మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు మిగిలారు. ఈ క్రమంలో ఎవరు బిగ్ బాస్...

జూలై 21న మొదలైన బిగ్ బాస్ థర్డ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మొత్తం 17 మందితో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు మిగిలారు. ఈ క్రమంలో ఎవరు బిగ్ బాస్ విన్నర్ కానున్నారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అందులో శ్రీముఖి టైటిల్ ఫేవరేట్ గా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో సినీ నటి హేమ యాంకర్ శ్రీముఖిపై ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది.

తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ బిగ్ బాస్ పై స్పందిస్తూ కొన్ని వాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక కేవలం హిమజ ఎలిమినేషన్ వరకే బిగ్ బాస్ చూశానని, ఆ తర్వాత చూడటం మానేశానని చెప్పుకొచ్చింది హేమ.. ప్రస్తుతం ఉన్నవాళ్లందరి మధ్య ఒక ఒప్పందమనేది ముందుగానే జరిగిపోయిందన్నారు. దానిప్రకారమే షో జరుగుతుందని అన్నారు.

శ్రీముఖి పుట్టిన రోజున ఆ గ్రూప్ అంతా సమావేశమై తనను ముందుగా హౌస్ నుంచి బయటకు పంపించేయాలని స్కెచ్ వేశారన్నారు. లేదంటే నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతుందని శ్రీముఖి బ్యాచ్ అంతా భావించిందన్నారు. మరికొన్ని రోజుల్లో షో ముగుస్తుంది అన్న క్రమంలో హేమ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.. ఇక హేమ బిగ్ బాస్ మొదలైన మొదటివారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories