అక్కడ దుమ్ములేపుతున్న రామ్ సినిమా .. తెలుగులో ప్లాప్ ..

అక్కడ దుమ్ములేపుతున్న రామ్ సినిమా .. తెలుగులో ప్లాప్ ..
x
Highlights

తెలుగు సినిమాలను వేరే భాషల్లో డబ్ చేయడం అనేది పెద్ద విషయం ఏమి కాదు .. కానీ సాధారణంగా అయితే తెలుగులో మంచి హిట్టు అయిన సినిమాలనే డబ్ చేయడానికి సదరు...

తెలుగు సినిమాలను వేరే భాషల్లో డబ్ చేయడం అనేది పెద్ద విషయం ఏమి కాదు .. కానీ సాధారణంగా అయితే తెలుగులో మంచి హిట్టు అయిన సినిమాలనే డబ్ చేయడానికి సదరు నిర్మాతలు ఇష్టపడుతుంటారు .. కానీ ఈ మధ్య ప్లాప్ సినిమాలకు కూడా డబ్ చేస్తున్నారు .. ఈ నేపధ్యంలో హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమ కోసమే సినిమాని హిందీలో డబ్ చేసి యుట్యుబ్ లోకి వదిలారు .. ఈ సినిమా హక్కులని కొనుగోలు చేసిన ఆదిత్య మూవీస్ హిందీలోకి దుండార్ కిలాడీ అనే పేరుతో రిలీజ్ చేసారు దీనితో ఈ సినిమాకి విశేషమైన స్పందన వస్తుంది ..వచ్చిన మూడు రోజుల్లోనే సినిమాకి 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి .. నాలుగున్నర లక్షల లైక్స్ వచ్చాయి . ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది . ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య పాత్రలో నటించారు . దీనికి దిల్ రాజు నిర్మాత .. త్రినధారావు నక్కిన దర్శకుడు .. కానీ ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయింది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories