బ్రాహ్మీ ఇంటి వంట.. ఇది నా అదృష్టం అంటున్న హరీష్ శంకర్

బ్రాహ్మీ ఇంటి వంట.. ఇది నా అదృష్టం అంటున్న హరీష్ శంకర్
x
Highlights

దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం వాల్మీకి.. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ( మంగళవారం ) తో ముగిసింది ... ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు .

దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం వాల్మీకి.. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ( మంగళవారం ) తో ముగిసింది ... ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు . బ్రహ్మానందంతో కలిసి భోజనం చేస్తున్న పిక్ ని షేర్ చేస్తూ "ఎంత మందికో ఈ అదృష్టం చిత్ర పరిశ్రమ రుణం తీర్చుకోలేనిది. వాల్మీకి చివరి రోజు చిత్రీకరణ. ఎన్నో సర్‌ప్రైజ్‌లుఅంటూ " క్యాప్షన్ పెట్టారు ...



బ్రహ్మానందం ఇంటి వంట అంటే చాలా మంది నటినటులకు చాలా ఇష్టం .. ముఖ్యంగా అయన ఇంటివంటకు హీరో చిరంజీవి ,బాలకృష్ణకి పెద్ద ఫ్యాన్ అంట .. అయన లంచ్ బాక్స్ లో కనీసం ఐదారు రకాల కూరలు అయిన ఉంటాయని , అయన ఇంటి నుండి ఫుడ్ కోసం వెయిట్ చేసే నటినటులు సెట్స్ లో చాలానే ఉంటారని చెప్పుకుంటారు ... ఇక ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత బ్రహ్మానందం సినిమాల్లో నటించడం లేదు . తాజాగా అయన ఈ సినిమాల్లో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు . ఈ సినిమాతో మళ్ళీ పాత బ్రహ్మానందంని చూపిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు .

ఇక వాల్మీకి సినిమా తమిళ్ లో వచ్చిన జిగార్తండ సినిమాకి రీమేక్ .. మంచి రిమేక్ స్పెషలిస్ట్ గా పేరున్న హరీష్ ఈ సినిమాని టెక్ అప్ చేయడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి . ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అథర్వా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు . ఈ సినిమా ఈ నెల ( సెప్టెంబర్) 20న ప్రేక్షకుల ముందుకు రానుంది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories