logo

ఆరోజు ఏడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చేసా ..! హరీష్

ఆరోజు ఏడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చేసా ..! హరీష్
Highlights

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్ .. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ,పూజా హేగ్దే...

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్ .. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ,పూజా హేగ్దే హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. తానూ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ కావడానికి ఎదురుకున్న సమస్యలను చెబుతూ " దర్శకుడు కావాలనే ఆలోచన తప్ప మరొకటి నా మైండ్ లో లేదు . ఈ ప్రాసెస్ లో ఓ దర్శకుడి దగ్గర రెండేళ్లు పని చేశా ... కథ , స్క్రీన్ ప్లే , మాటలు ఇలా అన్ని విషయాల్లో అన్నింటిలో సహాయం చేశా.. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సినిమా షూటింగ్ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా పత్రికల్లో నా పేరు కచ్చితంగా ఉంటుందని ఆసక్తిగా వెళ్ళాను కానీ ఆ దర్శకుడు పక్కకి తీసుకువెళ్లి ఎదో చెప్పుకొచ్చాడు. ఒక రూపాయి తీసుకోకుండా సినిమాకి పనిచేశా ! కనీసం పేరు కూడా వేయలేదు.. దీనితో ఆరోజు అలా అన్నపూర్ణ స్టూడియో నుండి ఏడుస్తూ బయటకు వచ్చాను. అలా కొన్ని రోజులు బాధపడి మళ్ళీ సినిమాల కోసం ప్రయత్నాలు కొనసాగించాను అని హరీష్ చెప్పుకొచ్చాడు .


లైవ్ టీవి


Share it
Top