మరో మెగా హీరోతో హరీష్ ?

మరో మెగా హీరోతో హరీష్ ?
x
Highlights

షాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ తరవాత మిరపకాయ్ సినిమాతో మంచి హిట్టు కొట్టి మంచి మాస్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక...

షాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ తరవాత మిరపకాయ్ సినిమాతో మంచి హిట్టు కొట్టి మంచి మాస్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా మంచి హిట్టు కావడంతో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు హరీష్.. ఇక ఆ తర్వాత చేసిన రామయ్య వస్తావయ్యా సినిమా ప్లాప్ కావడంతో హరీష్ కి చాన్సులు రావడం కష్టం అయిపొయింది.

ఈ క్రమంలో మెగా మేనల్లుడు సాయి తేజ్ తో కలిసి చేసిన సుబ్రమణ్యం ఫర్ సెల్ అనే సినిమాతో హిట్టు కొట్టి మళ్ళీ కం బ్యాక్ అనిపించుకున్నాడు హరీష్ . ఇక స్టార్ హీరోలలో ఒకరైనా బన్ని హరీష్ కి పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడు.అలా వీరి కాంబోలో వచ్చిన డీజే( దువ్వాడ జగన్నాధం ) మంచి హిట్టు అయింది. ఇక ఆ తర్వాత వరుణ్ తేజు తో కలిసి గద్దలకొండ గణేష్ సినిమాని చేశాడు. ఈ సినిమా కూడా మంచి హిట్టు అయింది. దీనితో హరీష్ కి మెగా డైరెక్టర్ అనే పేరు వచ్చింది.

అయితే తన తదుపరి చిత్రాన్ని కూడా మెగా హీరోతోనే చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమాని చేసేందుకు హరీష్ ఫిక్స్ అయినట్టు ఫిలిం నగర్ నుంచి టాక్.. ఇప్పటికే రామ్ చరణ్ కి హరీష్ కథని వినిపించారని, రామ్ చరణ్ కూడా దీనికి ఒకే చెప్పినట్టు వినికిడి. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30న విడుదుల చేయనున్నారు. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories