ఫ్లాప్ దర్శకుడికి వెంకీ రీమేక్ సినిమా ఛాన్స్ ?

venkatesh
x
venkatesh
Highlights

తమిళ్ హీరో ధనుష్ నటించిన `అసుర‌న్‌`చిత్రం ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు... ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు....

తమిళ్ హీరో ధనుష్ నటించిన `అసుర‌న్‌`చిత్రం ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు... ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ హీరోగా నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది.

ఈ సినిమాని హను రాఘవాపుడి డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర పరమ గాధ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా హీరో శర్వానంద్ తో చేసిన పడి పడి లేచే మనసు అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ఇందులో శ్రియను హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories