Top
logo

రాహుల్ కి ఘన స్వాగతం : అభిమానుల తాకిడి తట్టుకోలేక మిత్రుడి ఇంటికి

rahul sipligunj
X
rahul sipligunj
Highlights

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 కి రాహుల్ విజేతగా నిలిచినా సంగతి తెలిసిందే.....

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3 కి రాహుల్ విజేతగా నిలిచినా సంగతి తెలిసిందే.. దీనితో రాహుల్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మొగిపోయింది. అయితే రాహుల్‌ సోమవారం ఇంటికి చేరుకోగా అక్కడ అతనికి స్థానికులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని స్వాగతం పలికారు...

విజయనగర్‌ కాలనీలోని రాహుల్ ఇంటికి భారీ సంఖ్యలో అందరు చేరుకోవడంతో తాకిడి ఎక్కువ అయింది. ఆపడం ఎవరి వల్ల కాలేదు. దీనితో పోలీసులు సైతం లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది... అయితే రాహుల్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనకుండానే వెనుదిరిగాడు. తన మిత్రుడి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి తన బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. రాహుల్ విజయం పట్ల స్థానికులు అతని స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story