'ఆర్‌ఆర్‌ఆర్‌' కి దర్శకులు ఇద్దరు.. ప్రూఫ్ ఇదిగో.. !

ఆర్‌ఆర్‌ఆర్‌ కి దర్శకులు ఇద్దరు.. ప్రూఫ్ ఇదిగో.. !
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ (వర్కింగ్ టైటిల్ మాత్రమే).

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి దర్శకులు ఇద్దరని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చూపిస్తోంది! ఆర్.ఆర్.ఆర్ దర్శకత్వం స్థానంలో రాజమౌళి పేరుతో పాటు సంజయ్‌ పాటిల్‌ అనే వ్యక్తి పేరు కూడా కనిపిస్తోంది. పోనీ ఇంతకి ఈ సంజయ్‌పాటిల్‌ ఎవరని సెర్చ్‌ చేస్తే ఎవరో కూడా చూపించడం లేదు. సంజయ్‌ పాటిల్‌ ఎవరో గూగుల్‌కే తెలియాలకపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.


దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ముందుగా ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి టైం సరిపోకపోవడంతో 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories