బుల్లితెర రామాయణం సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్!.

బుల్లితెర రామాయణం సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి  అదిరిపోయే రెస్పాన్స్!.
x
Ramayanam
Highlights

కరోనాని అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు.

కరోనాని అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు.కరోనాని అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నేపధ్యంలో దూరదర్శన్ ఛానెల్లో 1987 ప్రసారమైన 'రామాయణం సీరియ‌ల్ ని ప్రజలు డిమాండ్ చేయడంతో కేంద్రప్రభుత్వం అంగీకరించింది.

రామాయణం మార్చి 28 నుంచి ప్రసారం చేయబోతున్నామని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించారు. ఈ సీరియల్ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అలాగే తిరిగి రాత్రి 9 నుంచి 10 వరకు ప్రసారం ప్రసారం అవుతుంది.

అయితే ఇప్పుడు ఈ 'రామాయణం సీరియ‌ల్ టీవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శనివారం ప్రసారమైన రెండు ఎపిసోడ్స్‌ను 34 మిలియన్స్ వీక్షించినట్టు బార్క్ లెక్కలు వెల్లడించాయి. ఇక ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్స్‌ ను దాదాపు 51మిలియన్ల మంది వీక్షించారు. ఇలా మొత్తంగా రామయణ్ సీరియల్‌కు మొదటి వారంలో 85మిలియన్ వచ్చినట్టుగా సమాచారం..

ఈ బుల్లితెర‌ 'రామాయణం'లో రాముని పాత్రలో నటించిన అరుణ్ గోవిల్, సీత పాత్రధారిగా దీపిక చిఖాలియా, లక్ష్మణుడిగా సునీల్‌ లాహిరి నటించారు. వీరికీ మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు రామానంద్‌ సాగర్‌ 33 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు. తాజాగా ఆ సీరియ‌ల్ లో రాముని పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ తాజాగా తన కుటుంబంతో కలిసి 'రామాయణం ధారావాహికను వీక్షిస్తున్న ఫొటో నెట్టింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే.. ఇక సోషల్ మీడియాలోనూ 'రామాయణం' హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అయ్యింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories