ఇకపై గోవాలో షూటింగ్స్ అంటే కండిషన్స్ అప్లై

ఇకపై గోవాలో షూటింగ్స్ అంటే కండిషన్స్ అప్లై
x
Highlights

ఇకపై గోవాలో షూటింగ్స్ చేయాలంటే కండిషన్స్ అప్లై అంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడి స‌ముద్ర తీర ప్రాంతాల్లో సినిమాలు తీయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.

ఇకపై గోవాలో షూటింగ్స్ చేయాలంటే కండిషన్స్ అప్లై అంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడి స‌ముద్ర తీర ప్రాంతాల్లో సినిమాలు తీయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అక్కడ షూటింగ్స్ చేసుకోవాలంటే ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ముందుగా స్క్రిప్ట్‌ను పూర్తిగా తనిఖీ చేస్తుంది. అందులోని అధికారులు స్క్రిప్ట్ చూసి ఓకే అంటేనే సినిమా షూటింగ్ చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వయంగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించడం విశేషం.. అయితే దీనివెనుక కారణం లేకపోలేదు అంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం..

కొన్ని రోజుల క్రితం, మాలాంగ్ అనే బాలీవుడ్ చిత్రం విడుదలైంది. ఈ మూవీని ప్రధానంగా గోవాలో చిత్రీకరించారు. ఈ సినిమా చూసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ... మలాంగ్‌ సినిమాలో గోవాలో డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతున్నట్లు చూపించిన అనేక సన్నివేశాలు ఉన్నందున తాను చాలా బాధపడ్డానని, గోవాకు మంచి శాంతిభద్రతల పరిస్థితి ఉందని, అందువల్ల రాష్ట్రాన్ని డ్రగ్ గమ్యస్థానంగా చిత్రీకరించడం అన్యాయమని అయన ఓ కార్యక్రమంలో విలేకరులకు తెలియజేశారు.

ఇలాంటి చిత్రీకరణ స్టేట్ యొక్క ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య రాయ్ కపూర్, దిషా పటాని మరియు అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో మాలాంగ్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories