Top
logo

మెగాస్టార్ సినిమాలో హాసిని... ఇది రీఎంట్రినా ?

మెగాస్టార్ సినిమాలో హాసిని... ఇది రీఎంట్రినా ?
X
Highlights

అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయం అయింది జెనిలియా.. ఆ తర్వాత...

అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయం అయింది జెనిలియా.. ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా వచ్చిన బొమ్మిరిల్లు సినిమా జెనిలియా కి హీరోయిన్ గా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమాలో హాసిని అనే పాత్రలో అంతగా ఒదిగిపోయింది జెనిలియా.. ఆ తర్వాత సినిమాలు చేసినప్పటికీ అవి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయాయి..

ఆ తర్వాత రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న జెనిలియా సరైనా రీఎంట్రీ కోసం ఎదురుచూస్తుంది. అందులో భాగంగా కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకేక్కబోతున్న సినిమాలో జెనిలియా ఓ ముఖ్యపాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు.

ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రకు చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారు. అందులో కాజల్, తమన్నా, నయనతార పేర్లు అనుకున్నప్పటికీ ఫ్రెష్ లుక్ కోసం కొరటాల ఆ పాత్రను జెనిలియాతో చేయించేందుకు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆమెతో కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తుంది. ఒకవేళ జెనిలియా ఈ పాత్రకు ఒప్పుకుంటే ఆమెకి ఇదే సరైనా రీఎంట్రీ అని అభిమానులు భావిస్తున్నారు..

Next Story