దొంగల నాయకుడు నానీ?

దొంగల నాయకుడు నానీ?
x
Highlights

నేచురల్ స్టార్ నానీ.. కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో శరవేగంగా ముస్తాబవుతోంది. నానీ సరసన 5 గురు హీరోయిన్లు సినిమాలో...

నేచురల్ స్టార్ నానీ.. కొత్త సినిమా గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో శరవేగంగా ముస్తాబవుతోంది. నానీ సరసన 5 గురు హీరోయిన్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయం సంచలనం గా మారింది. ఈ లోపు గ్యాంగ్ లీడర్ పేరుపై కూడా కొంత గందర గోళం నడిచింది.

ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ముందుకువచ్చే నానీ ఈ సినిమాలోనూ సరికొత్త తరహాలో వస్తున్నదని వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ చెప్పిన కథలోని మంచి పాయింట్ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నాడట నానీ అని చెబుతున్నారు. తాజాగా నానీ ఈ సినిమాలో దొంగలకు నాయకుడుగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఆ దొంగలు 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారంట. ఆ హీరోయిన్లకు బాస్ గా అంటే నాయకుడుగా నానీ కనిపించబోతున్నాడన్నది భోగట్టా. హీరోయిన్లేమిటి దొంగలేమిటి? నానీ వాళ్లకు నాయకుడుఏమిటి? అసలు గ్యాంగ్ లీడర్ అంటే హీరోయిన్ల గ్యాంగ్ లీడర్ అంటారేంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ఈ లోపు ఇలా వచ్చే లీకులను చూస్తూ ఎంజాయ్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories