సుబ్బరాజుకి గద్దలకొండ గణేష్ వార్నింగ్... ఎలా అంటే ?

సుబ్బరాజుకి గద్దలకొండ గణేష్ వార్నింగ్... ఎలా అంటే ?
x
Highlights

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్.. ముందుగా ఈ సినిమాకి వాల్మీకి అనే టైటిల్ పెట్టినప్పటికీ వివాదం చోటు...

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్.. ముందుగా ఈ సినిమాకి వాల్మీకి అనే టైటిల్ పెట్టినప్పటికీ వివాదం చోటు చేసుకోవడంతో టైటిల్ ని మార్చేసారు. అయినప్పటికీ సినిమాకి మంచి టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా పూజా హేగ్దే నటించింది. ఆదర్వ మురళీ ఓ ముఖ్యపాత్రలో కనిపించారు.

అయితే ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని తొలిగించింది చిత్ర యూనిట్ . ఆ సన్నివేశాన్ని ఇప్పుడు యుట్యూబ్ లో రిలీజ్ చేసారు. అందులో భాగంగా దర్శకుడు అయిన అదర్వ గద్దలకొండ గణేష్ తో ఓ సన్నివేశాన్ని తెరకేక్కిస్తాడు. ఈ సమయంలో విలన్ సుబ్బరాజుకి సంబంధించిన కొంతమంది మనషులు గణేష్ పై ఎటాక్ చేస్తారు. ఆ సమయంలో గణేష్ వారిని చితకబాది విలన్ సుబ్బరాజుకి ఫోన్ లో వార్నింగ్ ఇస్తాడు." రేయ్ పెంచులయ్య... గద్దలకొండని ఎం పీకలేక,ఈ పికుడుగాళ్ళను పంపించినావ్ లే... గద్దలకొండ నాకు బలం కాదు. గద్దలకొండకి నేనే బలం.. ఇప్పుడే వచ్చి నిన్ను నరకబుద్ది అయితుంది కానీ షూటింగ్ లో ఉన్నా .. మా డైరెక్టర్ ప్రింట్లు పంపియగానే నిన్ను పైకి పంపుతా" అని గద్దలకొండ గణేష్ సుబ్బరాజుకి వార్నింగ్ ఇస్తాడు.

ఈ వీడియోకి గాను ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికి ఈ వీడియోని ఆరు లక్షల మంది చూసారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories