'గద్దలకొండ గణేష్' హవా..10 రోజుల్లో..

గద్దలకొండ గణేష్ హవా..10 రోజుల్లో..
x
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. చివరి నిమిషంలో టైటిల్ విషయంలో వివాదం...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. చివరి నిమిషంలో టైటిల్ విషయంలో వివాదం చోటుచేసుకున్నప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లను రాబ‌డుతుంది. ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు చూపిస్తూ వచ్చింది. నైజాం 7.48 కోట్లు, సీడెడ్ 3.30 కోట్లు, ఉత్తరాంధ్ర 2.40 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.58 కోట్లు, వెస్ట్ గోదావరి 1.35 కోట్లు, గుంటూరు 1.71 కోట్లు, కృష్ణా 1.33 కోట్లు, నెల్లూరు 79 లక్షలు, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 19.94 కోట్ల మేర రాబట్టాడు గద్దలకొండ గణేష్. ఇతర రాష్ట్రాలు, ఓవెర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 23.08 కోట్ల షేర్ వచ్చిందని పేర్కొంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తానికి సరైన సమయంలో వచ్చి వరుణ్ తేజ్ గట్టి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories