నువ్వా నేనా ?.. క్రిస్మస్ బరిలో నాలుగు సినిమాలు

నువ్వా నేనా ?.. క్రిస్మస్ బరిలో నాలుగు సినిమాలు
x
Christmas Movies
Highlights

క్రిస్మస్ పండగకు మొత్తం నాలుగు సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. ఇందులో రెండు స్టేట్

క్రిస్మస్ పండగకు మొత్తం నాలుగు సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. ఇందులో రెండు స్టేట్ సినిమాలు కాగా మరొకటి హిందీ సినిమా కాగా, మరొకటి తమిళ్ నుంచి డబ్ అవుతున్న తెలుగు సినిమా.. సంక్రాంతి పండగకు బడాబడా హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి అవి వచ్చెలోపు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి ? ఆ సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

బాలకృష్ణ - రూలర్

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది.. కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వేదిక, సోనాలి చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపిస్తూ సినిమాపైన భారీ అంచనాలను పెంచేశాడు.. తాజాగా విడుదలైన చిత్ర టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక సంక్రాంతి హీరోగా బాలయ్య కి ఎలాగూ పేరుంది. మరి ఇప్పుడు క్రిస్మస్ బరిలో నిలిచి క్రిస్మస్ హీరో అని అనిపించుకుంటాడో లేదో చూడాలి మరి.

సాయి ధరమ్ తేజ్ - ప్రతి రోజూ పండగే

చిత్రలహరి సినిమా తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా ప్రతి రోజూ పండగే .. పూర్తి కుటుంబ కథ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ కథానాయకగా నటిస్తుంది. సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కి విడుదలవుతున్న ఈ సినిమా ఆ అంచనాలకి అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

కార్తీ - దొంగ

తాజాగా ఖైదీ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు కార్తీ .. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో దొంగ అనే సినిమాని చేస్తున్నాడు ..ఇందులో నటి జ్యోతిక కూడా నటిస్తుంది. ఇందులో కార్తీకి సోదరిగా జ్యోతిక కనిపించడం విశేషం.. ఈ చిత్రం లో కార్తీ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి

సల్మాన్ - దబాంగ్

దబాంగ్ సినిమాకి వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్ .. తాజాగా దబాంగ్ 3 తో సిద్దమవుతున్నాడు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు సల్మాన్.. క్రిస్మిస్ బరిలో నిలిచి భారీ హిట్టు కొట్టాలని సల్మాన్ భావిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories