సంక్రాంతి బరిలో మొత్తం ఐదు సినిమాలు... ధియేటర్లు సరిపోతాయా ?

సంక్రాంతి బరిలో మొత్తం ఐదు సినిమాలు... ధియేటర్లు సరిపోతాయా ?
x
Highlights

ఈసారి సంక్రాంతికి వార్ మామలుగా ఉండేలా లేదు.. మొత్తం ఐదు సినిమాలు బరిలోకి దిగి నువ్వా నేనా? అనేలా కనిపిస్తున్నాయి. అందులో మూడు సినిమాలు ఇప్పటికే...

ఈసారి సంక్రాంతికి వార్ మామలుగా ఉండేలా లేదు.. మొత్తం ఐదు సినిమాలు బరిలోకి దిగి నువ్వా నేనా? అనేలా కనిపిస్తున్నాయి. అందులో మూడు సినిమాలు ఇప్పటికే అధికారకంగా విడుదల తేదిన ప్రకటించాయి. ఇందులో మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంటపురములో, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు ఒకే రోజున 12.01.2020 న విడుదల కానున్నాయి ..

అయితే ఇవే కాకుండా మరో రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండలాని చూస్తునట్టు తెలుస్తుంది.అందులో వెంకటేష్ ,నాగ చైతన్య కలిసి నటిస్తున్నా వెంకీ మామ సినిమాని కూడా బరిలోకి దించుతున్నట్ల సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక తనకి అచ్చొచ్చిన సంక్రాంతి బరిలోనే తన లేటెస్ట్ మూవీని కూడా బరిలోకి దించాలని బాలకృష్ణ అనుకుంటున్నారట...

కేయస్ రవికుమార్ దర్శకత్వంలో అయన ఓ సినిమాని చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మొత్తం ఇలా అయిదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడం ఫాన్స్ కి ఇష్టమే కానీ సినిమాకి కావాల్సినన్ని ధియేటర్లు దొరకడం అనేది కష్టమే.. మామలు సమయంలోనే సినిమాలకి ధియేటర్లు కొరత ఉంది. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఇంకా కష్టమే అని చెప్పవచ్చు.. వీటికి తోడు కలెక్షన్ల ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుంది. వీటిని పరిగణలోకి తీసుకొని ఎవరైనా వెనుకకి తగ్గుతారా లేదా ? మరో ఏంటో చూడాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories