అంగరంగ వైభవంగా సినీ నటి అర్చన వివాహం

Archana Wedding
x
Archana Wedding
Highlights

సినీ నటి అర్చన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.. గురువారం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు అర్చన జగదీశ్ ఇరువురు కుటుంబాల సమక్షంలో ఒకటయ్యారు. వీరి...

సినీ నటి అర్చన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.. గురువారం తెల్లవారు జామున 1:30 నిమిషాలకు అర్చన జగదీశ్ ఇరువురు కుటుంబాల సమక్షంలో ఒకటయ్యారు. వీరి పెళ్లి వేడుకకి బంధువులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి ముందు అతిధుల కోసం గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సంగీత్ ని బాగా గ్రాండ్ గా నిర్వహించారు. నవ వధూవరులు జగదీశ్, అర్చన అడిపాడారు. అర్చన హీరోయిన్ కాకముందు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసారు. ఆ తర్వాత కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె చివరగా సప్తగిరి హీరోగా నటించిన వజ్ర కవచధర గోవింద అనే చిత్రంలో నటించారు. అర్చన బిగ్ బాస్ మొదటి సీజన్ లో కూడా పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories