విజయ్, పూరి: టైటిల్ ' ఫైటర్' కాదట!

విజయ్, పూరి: టైటిల్  ఫైటర్ కాదట!
x
Highlights

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు విజయ్.. గీతా గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. దీనితో విజయ్ పాపులారిటీ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఆ తరవాత వచ్చిన సినిమాలు ఏమీ కూడా అర్జున్ రెడ్డి స్థాయిలో అలరించలేకపోయాయి. గత ఏడాది వచ్చిన డియర్ కామ్రేడ్, ఈ ఏడాది వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయి ప్లాపులను మూటగట్టుకున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ,పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి హీరోయిన్, సహనిర్మాత అయిన ఛార్మి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకి ఫైటర్ అఫిషియల్ టైటిల్ కాదని, వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని వెల్లడించింది. దీనితో విజయ్ ఫ్యాన్స్ ఖంగు తిన్నారు.. పూరి, విజయ్ సినిమా అంటే మినిమం టైటిల్ ఉంటుందని ఛార్మీ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తోంది. ముంబైలో ఇప్పటికే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణం వల్ల సినిమా వాయిదా పడింది. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories