ఆపండి మీరు మీ డప్పులు.. వాళ్లను పిచ్చోళ్లను చెయ్యొద్దు: హరీష్ శంకర్‌, నానిలపై ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆపండి మీరు మీ డప్పులు.. వాళ్లను పిచ్చోళ్లను చెయ్యొద్దు: హరీష్ శంకర్‌, నానిలపై ఫ్యాన్స్ ట్రోలింగ్
x
Highlights

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ వరుస హీట్స్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటివల జెర్సీ సినిమాతో మరోహీట్ తన ఖాతాలో వేసుకున్నాడు నానీ. తాజాగా మరోసారి గ్యాంగ్...

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ వరుస హీట్స్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటివల జెర్సీ సినిమాతో మరోహీట్ తన ఖాతాలో వేసుకున్నాడు నానీ. తాజాగా మరోసారి గ్యాంగ్ లీడర్‌తో మళ్లీ థియేటర్లో సందడి చేయనున్నాడు. అయితే ఈ చిత్రం వస్తావానికి ఈ నెల 30 తేదిన విడుదల చేయాల్సిఉండే కానీ అదే రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సాహో సినిమా విడుదల అవుతున్న నేపధ్యంలో గ్యాంగ్ లీడర్ వాయిదా పడిన విషయం తెలిసిందే కాగా..ఈ సినిమాను వచ్చే నెల(సెప్టెంబర్) 13వ తేదిన రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు. ఇదిలా ఉంటే మరోవైపు దర్శకుడు హరీశ్ శంకర్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం వాల్మీకి సినిమా కూడా కొద్దిరోజుల క్రితం సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఇదే రోజు గ్యాంగ్ లీడర్ కూడా బరిలో దిగుతుండంతో దర్శకుడు హరీశ్ శంకర్ విష్ చేశారు. వావ్ సెప్టెంబర్ 13 సినీ ప్రియులకు పండగరోజే... వాల్మీకి, గ్యాంగ్ లీడర్ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందంటూ.. మా వాల్మీకి చిత్రబృందం తరుపున గ్యాంగ్ లీడల్ చిత్రబృందానికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు అంటూ ట్వీట్టర్‌లో పెర్కోన్నారు. హరీశ్ శంకర్ పెట్టిన ట్వీట్‌కు హీరో నానీ రిప్లే ఇస్తూ ధ్యాంకు బ్రదర్ మీ వాల్మీకి కూడా నా తరుపున శుభాకాంక్షలు అంటూ... ఈ సెప్టెంబర్ 13 గ్యాండ్ వీకెండ్ కావాలంటూ నానీ ట్వీట్ చేశారు.

అయితే దర్శకుడు హరీశ్ శంకర్, నానీ చేసిన ట్వీట్లకు ఓ అభిమాని స్పందిస్తూ... ఆ హ ఆపండి మీ డప్పులు.. ఒకరి డప్పులు మరొకరు కొట్టుకొని జనాల్ని జనాల్ని పిచ్చివాళ్లని చేయెద్దు.. జనాలకు తెలుసు సెప్టె్ంబర్ పండుగా.. దండుగా అనేది అంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక మరికొందరు నాని ఫ్యాన్స్ హరీష్ శంకర్ చేసిన ట్వీటుపై స్పందించిన తీరు తీవ్ర చర్చనీయాంశం మారింది. ఓ హరీష్ భయ్యా... మీరు అనవసరంగా మా హీరో నాని సినిమాతో క్లాష్ పెట్టుకున్నారు. మంచిగా పక్కకు తప్పుకుంటే మీకే మంచిది అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.











Show Full Article
Print Article
More On
Next Story
More Stories