ఇక ప్రతి సోమవారం మహేష్ అభిమానులకి పండగే

ఇక ప్రతి సోమవారం మహేష్ అభిమానులకి పండగే
x
Mahesh Babu
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టిజర్ యుట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇందులో మహేష్ ఆర్మీ అజయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే చిత్ర ప్రమోషన్ ని చాలా వినూత్నంగా మొదలు పెట్టింది చిత్ర యూనిట్.. ఇకపై ప్రతి సోమవారం సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ ను విడుదల చేయనుందట చిత్రబృందం.. అందులో సినిమాకి సంబంధించిన పోస్టర్స్, పాటలు, వీడియోస్, మేకింగ్ వీడియోస్ ఏవైనా ఉండొచ్చు అన్నమాట.. ఇలా సినిమా విడుదలయ్యే వరకు ప్రతి సోమవారం ప్రేక్షకులను అట్రాక్ట్ చేయనుంది మహేష్ కొత్త సినిమా..

ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేష్, రాజేంద్రప్రసాద్, విజయశాంతి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories