లక్కి ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా... ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే ?

లక్కి ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా... ఏకంగా మెగాస్టార్ సినిమాలోనే ?
x
Highlights

సైరా సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించాడు మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం...

సైరా సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించాడు మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.. సైరా అయిపోయిన వెంటనే మరో సినిమాని స్టార్ట్ చేసారు చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా ప్రారంబోత్సవాన్ని కూడా జరుపుకుంది. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.

ఇప్పటికి హీరోయిన్ ని ఎంపీక చేయలేదు. త్రిషను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో తెలుగు అమ్మాయి ఈషారెబ్బాకి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. హీరోయిన్ గా కాదు. కానీ ఓ స్పెషల్ రోల్ కోసం దర్శకుడు కొరటాల ఈషాను సంప్రదించినట్టు సమాచారం.. ఈషా ఈ మధ్య సినిమాల్లో అవకశాలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఈషా రాగాల 24 గంటల్లో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories