ఇస్మార్ట్ గా ఉండాలనుకోవద్దు..అది మీ ఆరోగ్యానికి హానికరం!

ఇస్మార్ట్ గా ఉండాలనుకోవద్దు..అది మీ ఆరోగ్యానికి హానికరం!
x
Highlights

ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలనుకోవద్దంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వార్నింగ్ ఇస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా పూర్తి...

ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలనుకోవద్దంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వార్నింగ్ ఇస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. ఈ సినిమా గురువారం విడుదల కానుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని హీరో రామ్ ట్విట్టర్ లో తెలిపాడు.

ఈ సందర్బంగా రామ్ 'ధూమపానం, మద్యపానంతో పాతో ఇస్మార్‌ శంకర్‌లా నిజజీవితంలో వ్యవహరించటం ఆరోగ్యానికి హానికరం. ఇస్మార్‌ శంకర్‌ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌గా వ్యవహరించండి ' అంటూ ట్వీట్‌ చేశారు.

ఇంతకు ముందు పూరీ సూపర్ హిట్ సినిమాలు పోకిరీ, దేశముదురు, బిజినెస్‌మేన్‌ సినిమాలకూ ఏ సర్టిఫికెట్ రావడం గమనార్హం. సినిమా యూనిట్ కూడా ఈ విషయంలో సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కొడుతుందని నమ్ముతున్నారు. రామ్‌ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories