ఎంత మంచివాడవురా రిలీజ్ డేట్ ఫిక్స్ ...

entha manchivadavu ra
x
entha manchivadavu ra
Highlights

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా.. సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మేహరీన్ కథానాయకగా నటిస్తుంది....

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా.. సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 15 న ఈ సినిమాని విడుదల చేయనున్నారు..

ఈ సినిమానే కాకుండా సంక్రాంతి బరిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో ఉన్నాయి. అంతేకాకుండా రజినీకాంత్ దర్బార్ కూడా ఈ సంక్రాంతికే విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఎంత మంచివాడవురా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టిజర్ సినిమాపైనభారీ అంచనాలను పెంచేసింది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories