'ఎంత మంచివాడవురా!' ట్విట్టర్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా..

ఎంత మంచివాడవురా! ట్విట్టర్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా..
x
Highlights

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'.. మేహ్రీన్ కథానాయకగా నటించింది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్...

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'.. మేహ్రీన్ కథానాయకగా నటించింది. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్స్ కి మంచి టాక్ వచ్చింది. సంక్రాంతి పండగ కానుకగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శతమానం భవతి లాంటి ఫ్యామిలీ సినిమా తీసి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సతీశ్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, మహేష్,అల్లు అర్జున్ సినిమాలకి పోటిగా రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి బరిలోకి లేటుగా వచ్చినా 'ఎంత మంచివాడవురా!' అంటూ లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్.

మరో వైపు సంక్రాంతి సందర్భంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, దర్బార్ చిత్రాలు మంచి హిట్ సాధించాయని ప్రేక్షకులు చెపుతుంటే, నందమూరి ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమా కోసం ఇన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి యూఎస్‌ఏలో ప్రీమియర్స్ షోలు తెరపైకెక్కాయి. ఇంకే ముంది సినిమా చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా 'ఎంత మంచి వాడవురా!' ఎలా ఉందో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

కొంతమంది ప్రేక్షకులు కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా!' డీసెంట్‌గా ఉందని అంటున్నారు. మరో వైపు కొంత మంది మాత్రం ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక పోయిందని నిరుత్సాహ పడుతూ ట్వీట్ చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం ఏకంగా ఈ సినిమా చూడటం కష్టమే అని ట్వీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కాస్త ఆకట్టుకున్న క్యారెక్టర్ వెన్నెల కిషోర్ దే అని అంటున్నారు ప్రక్షకులు. ఇక దీనిపై యుఎస్‌ఏ రిపోర్ట్ ప్రకారం కళ్యాణ్ రామ్ కూడా సంక్రాంతి బరిలో విజయాన్ని అందుకున్నారని ట్వీట్స్ చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ అయితే అన్నిచోట్ల నుండి 'ఎంత మంచి వాడవురా!' బెనిఫిట్ షోస్ అన్నీ హౌస్ ఫుల్ అంటూ వరుస ట్వీట్స్ చేస్తూ కళ్యాణ్ రామ్‌కి మంచి బూస్టింగ్ ఇస్తున్నారు. ఇకపోతే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బినిఫిట్ షోలు పూర్తికాకపోవడంతో అసలైన టాక్ ఎప్పుడొస్తుందా అని వేచి చూస్తున్నారు నందమూరి ఫాన్స్.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో పాటు టి.ఎన్.ఆర్, తనికెళ్ల భరణి, విజయకుమార్, సుమిత్ర, నరేష్, సుహాసిని, వెన్నెల కిశోర్, శరత్ బాబు, అన్నపూర్ణమ్మ, సుధర్శన్, భద్రం, సుభలేఖ సుధాకర్, పవిత్ర లోకేష్ తదితరులు నటించారు. ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా కలిసి సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories