ఇంకేం.. ఇంకేం కావాలే!

ఇంకేం.. ఇంకేం కావాలే!
x
Highlights

మహర్షి విజయాన్ని యూనిట్ అంతా ఆస్వాదిస్తోంది. అందరి కంటే ఎక్కువగా మహేష్ బాబు ఈ విజయం పై ఎగ్జైట్ అవుతున్నాడు. సక్సెస్ మీట్ లో కాలరెగరేసి మాట్లాడిన మహేష్...

మహర్షి విజయాన్ని యూనిట్ అంతా ఆస్వాదిస్తోంది. అందరి కంటే ఎక్కువగా మహేష్ బాబు ఈ విజయం పై ఎగ్జైట్ అవుతున్నాడు. సక్సెస్ మీట్ లో కాలరెగరేసి మాట్లాడిన మహేష్ తరువాత దర్శకుడు వంశీకి బుగ్గ మీద ముద్దిచ్చి తన సంతోషాన్ని.. ప్రేమను వ్యక్తం చేశాడు. దీంతో పైడిపల్లి ఖుషి అయిపోతున్నాడు. ఇంకేం.. ఇంకేం కావాలే అనుకుంటూ సంబర పడిపోతున్నాడు. 'ఇంతకుమించి ఇంకేం అడగగలను' అంటూ తెగ సంబరపడిపోతున్నాడు. మహేశ్ కెరీర్‌లోనే కాదు వంశీ కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా సినిమా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మహేశ్‌.. వంశీ బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ ఆయన్ను అభినందించారు. ఆ సమయంలో వంశీ తీసిన సెల్ఫీని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి 'నా బెస్ట్‌ మూమెంట్‌. ఇంతకంటే ఇంకేం అడగగలను' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలోని 'వీకెండ్‌ వ్యవసాయం' అన్న కాన్సెప్ట్‌ నుంచి ఎందరో స్ఫూర్తిపొందుతున్నారు. పొలం పనులు చేస్తున్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ 'మహర్షి' అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. అమెరికాలో ఇది మహేశ్‌ తొమ్మిదో మిలియన్‌ డాలర్ల చిత్రమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories