logo

డబల్ ఇస్మార్ట్ పై క్లారిటీ

ismart shankarismart shankar
Highlights

అప్పటికే చాలా ఫ్లాప్ లతో సతమతం అవుతున్న పూరి,రామ్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ సక్సెస్ ని ఇచ్చింది.....

అప్పటికే చాలా ఫ్లాప్ లతో సతమతం అవుతున్న పూరి,రామ్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ సక్సెస్ ని ఇచ్చింది.. దాదాపుగా ఈ సినిమా 36కోట్ల షేర్, 72 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా హిట్టు అయిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు, పూరి, రామ్ కి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. కానీ అప్పటికే రామ్ తన తదుపరి సినిమాని కిషోర్ తిరుమలతో చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఇక పూరి కూడా విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. అంతేకాకుండా తన కొడుకు ఆకాష్ పూరితో రొమాంటిక్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు.

దీనితో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ పై ఇటు రామ్, అటు పూరి ఎవరికీ వారే క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు.. సినిమా స్క్రిప్ట్ రెడీ కావాలంటే కొంచం టైం పడుతుందని రామ్ చెప్పగా, ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తీయాల్సి వస్తుందని తనకి ముందే తెలుసునని అందుకే లైన్ సిద్దం చేసుకున్నానని, డబల్ ఇస్మార్ట్ పేరుతో టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టనని పూరి చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం రామ్ కిషోర్ తిరుమలతో సినిమా అయిపోగానే ,ఇటు విజయ్ తో పూరి సినిమా అయిపోగానే డబల్ ఇస్మార్ట్ ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది.


లైవ్ టీవి


Share it
Top