దొరబాబుకి అండగా నిలిచిన భార్య అమూల్య

దొరబాబుకి అండగా నిలిచిన భార్య అమూల్య
x
Highlights

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే కామెడీ షో ద్వారా చాలా మంది హాస్యనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే కామెడీ షో ద్వారా చాలా మంది హాస్యనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అందులో దొరబాబు ఒకరు. ఆ షోలో కనిపిస్తూ కమెడియన్ గా మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే కొద్దిరోజుల కింద విశాఖపట్నంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయడంతో దొరబాబుతో పాటు మరో ఆర్టిస్ట్ పరదేశీ కూడా పట్టుబట్టాడు.. వీరితో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది.

అయితే విషయం బయటకు రావడంతో అతనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. పెళ్ళాం, పిల్లలు ఉండి ఇదేం పనులని విమర్శించారు. ఈ నేపద్యంలో అతని భార్య అమూల్య అతనికి అండగా నిలబడింది. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకి సమాధానం ఇస్తోంది. "ఓ వ్యక్తిని అపార్థం చేసుకునేటప్పుడు గతంలో ఆయన మనతో ఎలా ఉన్నాడనేది మరిచిపోకూడదు.. కొన్నిసార్లు మన కళ్లను మనమే నమ్మలేం.. అవి కూడా మనను మోసం చేస్తుంటాయి అంటూ టిక్ టాక్ లో పోస్ట్ పెట్టింది."

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక దీన్నిబట్టి భర్తకు అండగా ఉంటానని చెప్పకనే చెబుతుంది. దొరబాబు నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ గా పని చేసే అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరు టిక్ టాక్ లో కూడా కనిపిస్తూంటారు..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories