ఆర్.ఆర్.ఆర్ లో ఎప్పుడైనా ఇవి గమనించారా?

RRR
x
RRR
Highlights

ఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమా చేయడానికి రంగంలోకి దిగారంటే పక్కా ప్లాన్ ఉంటుంది. సినిమాని తీయడంలోనే కాదు.. సినిమాని ప్రమోషన్ చేయడంలోను రాజమౌళి స్టైల్ వేరు. బాహుబలి సినిమా ప్రమోషన్ ని రాజమౌళి చేసిన తీరు ఓ అద్భుతమనే చెప్పాలి..సినిమాపైన అంచనాలు పెంచేందుకు ఒక్కో పాత్రను మెల్లిమెల్లిగా బయటకు వదులుతూ సినిమాపై అటేన్షన్ ని పెంచేసాడు రాజమౌళి.

ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీయబోయే సినిమాకి కూడా జక్కన్న ఇదే రూల్ ఫాలో అవుతునట్టు తెలుస్తుంది. బాహుబలి 2 విడుదలైన తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది. అప్పుడు నవంబర్ 18 2017 న ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి సోఫోలో కూర్చొని ఉన్న ఫోటోను బయటకు వదిలి పెద్ద షాక్ ఇచ్చాడు.

సరిగ్గా ఇది అయిపోయిన సంవత్సరానికి అంటే నవంబర్ 19 2018 న రాజమౌళి షూటింగ్ సెట్ లో ఉన్న ఓ ఫోటోను బయటకు వదిలాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి, అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రల గురించి చెప్పుకొచ్చాడు. అప్పుడే సినిమాపైన మరిన్ని అంచనాలను పెంచేసాడు. ఇక ఇప్పుడు అంటే నవంబర్ 20 2019 న సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరో చెప్పేసాడు.

ఇలా రాజమౌళి నవంబర్ నెల 18,19,20 తేదిలలో సినిమాకి సంబంధించిన అప్డేట్ లను బయటకు వదులుతూ వచ్చాడు. అయితే ఇది పక్కా ప్లాన్ తోనే లేకా యాదృచ్చికంగా ఇలా జరిగిందా అన్నది తెలియదు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసనఎన్టీఆర్ కోమర్ భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒవిలియా మేరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ పక్కన అలియ భట్ నటిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది 30 జులై న విడుదల చేయనున్నారు. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న నుండి ఈ సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories