సాహో కి బాలీవుడ్ లో దారుణమైన రివ్యూలు, రేటింగ్లు ...

సాహో కి బాలీవుడ్ లో దారుణమైన రివ్యూలు, రేటింగ్లు ...
x
Highlights

బాహుబలితో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది ,అ తర్వాత అంతే స్థాయి బడ్జెట్ తో సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు . అందుకే దాదాపు...

బాహుబలితో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది ,అ తర్వాత అంతే స్థాయి బడ్జెట్ తో సినిమాలు చేసేందుకు ప్రభాస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు . అందుకే దాదాపు 350 కోట్లతో సినిమా తెరకెక్కించారు . సినిమా మేకింగ్ ,గ్రాఫిక్స్ ఎక్కడ కూడా తక్కువ లేకుండా సినిమాని ప్లాన్ చేసారు . అంతే స్థాయిలో బడ్జెట్ ని రాబట్టుకునేందుకు మొత్తం నాలుగు బాషల్లో సినిమాని విడుదల చేసాడు . ఇక ఇండియా వైడ్ మొత్తంలో బాలీవుడ్ మార్కెట్ ఎక్కువ .. సినిమా అధిక లాభాలు వచ్చేవి ఇక్కడి నుండే.. అందుకే బాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకొని హీరోయిన్ గా కూడా శ్రద్దా కపూర్ ని ఎంచుకున్నారు .

ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . సినిమాకి తెలుగు బాషలో మిక్స్డ్ టాక్ రాగా ఇక బాలీవుడ్ లో మాత్రం దారుణమైన రివ్యూలు , రేటింగ్స్ వినిపిస్తున్నాయి . బాలీవుడ్ లో మంచి క్రిటిక్ గా పేరుపొందిన తరుణ్ ఆదర్శ్ సినిమాకి దారుణమైన రివ్యూ ఇచ్చారు . "సినిమా భరించలేనంతగా ఉందని , టాలెంట్ , డబ్బు , అన్ని వృధా అయ్యాయి అని అన్నారు .గందరగోళమైన స్క్రీన్ ప్లే , మేచురిటి లేని దర్శకత్వం" అంటూ సినిమాకి 1/2 రేటింగ్ ఇచ్చారు . అయితే ఇప్పుడు సినిమా హిట్టా పట్టా అన్నది తెలియాలంటే మాత్రం మరో వారం ఆగాలి .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories