డిస్కోరాజా ప్రీ రీలిజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

డిస్కోరాజా ప్రీ రీలిజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
x
Highlights

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హీరో రవితేజకి సరైనా హిట్టు లేదు. ఆ తర్వాత చేసిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఆశించిన...

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హీరో రవితేజకి సరైనా హిట్టు లేదు. ఆ తర్వాత చేసిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీనితో ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు చేసే రవితేజ ఇప్పుడు డిస్కో రాజా సినిమాని సంవత్సరం నుంచి చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని గణతంత్ర దినోత్సవం సందర్బంగా విడుదల చేయాలనీ చూస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. థ్రిల్లర్ అండ్ సైంటిఫిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నాడు. సునీల్, వెన్నెల కిశోర్, బాబీ సింహా, సత్య, రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరును పెంచేసింది. అందులో భాగంగానే ఈ నెల 18 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించనుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత క్రాక్ అనే సినిమాని చేస్తున్నాడు రవితేజ.. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్నీ సాధించాయి..








Show Full Article
Print Article
More On
Next Story
More Stories