Disco Raja: త్రీ డేస్ కలెక్షన్స్

Disco Raja: త్రీ డేస్ కలెక్షన్స్
x
Highlights

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం డిస్కోరాజా.. రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో...

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం డిస్కోరాజా.. రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. అయితే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి చిత్రాలు ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నప్పటికి డిస్కో రాజా మొదటిరోజు 3.5 కోట్ల కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు కొంచం తగ్గాయని చెప్పాలి. ఇక మూడో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

నైజాం 2.52 cr

సీడెడ్ 0.81 cr

ఉత్తరాంధ్ర 0.76 cr

ఈస్ట్ 0.42 cr

వెస్ట్ 0.34 cr

కృష్ణా 0.40 cr

గుంటూరు 0.40 cr

నెల్లూరు 0.23 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.42 cr

ఓవర్సీస్ 0.56 cr

వరల్డ్ వైడ్ టోటల్ 6.86 cr (share)

విడుదలకి ముందు ఈ చిత్రం రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది.. ఇక ఓవర్సీస్, ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కలుపుకుని రూ. రూ.3.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. రవితేజ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు. బాబీ సింహ ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా, రామ్ తాళ్లూరి సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రవితేజ ఆ తర్వాత తనతో డాన్‌ శ్రీను, బలుపు సినిమాలను తెరకెక్కించిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు రవితేజ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories