Top
logo

రవితేజ న్యూ అవతార్‌పై క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..

రవితేజ న్యూ అవతార్‌పై క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..
Highlights

వరుస ఫ్లాపులు సతమతం అవుతున్నా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గడం లేదు. తాజాగా డిస్కో రాజా సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం.

వరుస ఫ్లాపులు సతమతం అవుతున్నా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గడం లేదు. తాజాగా డిస్కో రాజా సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసి.. కాస్తంత స్లిమ్ అయ్యాడు. అయితే రవితేజ్‌ యంగ్‌ లుక్‌కు సంబంధించిన ఫోటో అంటూ.. ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ ఫోటోలో రవితేజ 25 ఏళ్ల కుర్రాడిల కనిపిస్తుండటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే ఇది నిజంగానే సినిమాలో పాత్రా, లేక అభిమానులు ఎవరైనా ఫేస్‌ యాప్‌ లాంటి టెక్నాలజీ ద్వారా చేశారా..? అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఫోటోపై చిత్రయూనిట్‌ స్పందించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో అఫీషియల్‌ కాదని, త్వరలోనే అధికారిక ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తామని దర్శకుడు వీఐ ఆనంద్‌ వెల్లడించారు. దీంతో రవితేజ యంగ్‌ లుక్‌పై క్లారిటీ వచ్చేసింది.
లైవ్ టీవి


Share it
Top