వాల్మీకిలో లెక్కల మాస్టర్ ....

వాల్మీకిలో లెక్కల మాస్టర్ ....
x
Highlights

అయితే సినిమాలో భాగంగా దర్శకుడు సుకుమార్‌ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు ... వరుణ్ తేజ్ పై ఓ సినిమాని తెరకెక్కించే క్రమంలో సుకుమార్ ఈ సినిమాలో కనిపిస్తాడు .

ఒక దర్శకుడి సినిమాలో మరో దర్శకుడు కనిపించడం అనేది కొత్తేమి కాదు . గతంలో గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎం మాయ చేసావే అనే చిత్రంలో పూరి జగన్నాధ్ కనిపించారు . ఇక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన నేనింతే అనే సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్ కనిపించారు . ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో దర్శకుడు సుకుమార్ కనిపించనున్నారు ...

వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది .తమిళ్ లో మంచి హిట్టుగా నిలిచినా జిగర్తాండను సినిమాకి ఇది రీమేక్ అన్నమాట.. దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి మంచి రీమేక్‌ స్పెషలిస్ట్‌ గా పేరుపొందాడు హరీష్ ... దీనితో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . దీనికి తోడు సినిమాలో వరుణ్ లుక్ , సినిమా టిజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి.

అయితే సినిమాలో భాగంగా దర్శకుడు సుకుమార్‌ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు ... వరుణ్ తేజ్ పై ఓ సినిమాని తెరకెక్కించే క్రమంలో సుకుమార్ ఈ సినిమాలో కనిపిస్తాడు . ఇందులో సుకుమార్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు హరీష్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు .ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది . ఈ సినిమాను సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నారు. ఈ సినిమాని 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు . సెప్టెంబర్ 20న వాల్మీకి విడుదల కానుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories