సాహోని మరోసారి చూడండి .. సుజీత్ భావోద్వేగ పోస్ట్

సాహోని మరోసారి చూడండి .. సుజీత్ భావోద్వేగ పోస్ట్
x
Highlights

సాహోలో మీరు ఏదైనా మిస్ అయినట్లు అయితే దయచేసి మళ్ళీ చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటున్నారు సాహో దర్శకుడు సుజీత్

దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సాహో .. టాక్ కొంచం అటు ఇటు గా ఉన్నా, కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతుంది . అన్ని రికార్డులను తిరగరాస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తుంది . అయితే సినిమాపై దర్శకుడు స్పందించాడు . " నాకు 17 సంవత్సరాల వయసులో నా మొదటి లఘు చిత్రం చేసాను . డబ్బు లేదు, జట్టు కూడా లేదు కానీ కుటుంబం నుండి చాలా మద్దతు ఉంది. నా లఘు చిత్రాలలో 90% డైరెక్షన్ చేసి ఎడిట్ చేసేవాడిని. నేను నా తప్పుల నుండి చాలా నేర్చుకున్నాను మరియు విమర్శలు ఎల్లప్పుడూ నా ప్రయాణానికి అదనపు ప్రోత్సాహం లాంటివి.

చాలా దూరం ప్రయాణించి, చాలా అడ్డంకులను ఎదుర్కొన్నాను , కానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఈ రోజు చాలా మంది ప్రజలు సాహోను చూశారు. కొందరు దాని నుండి ఎక్కువ ఆశించారు, కాని చాలామంది దీనిని ఇష్టపడ్డారు.సినిమా చూసిన అందరికీ ధన్యవాదాలు... సాహోలో మీరు ఏదైనా మిస్ అయినట్లు అయితే దయచేసి మళ్ళీ చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ భావోద్వేగంతో పోస్ట్ చేసాడు సుజీత్ .దీనికి తోడు తన లఘు చిత్రాలు నిర్మించే క్రమంలోని కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నాడు . మొత్తం సాహో సినిమా ఐదు వర్కింగ్ డేస్ లో 350 కోట్లను బద్దలు కొట్టినట్లు చిత్ర యూనిట్ యువీ క్రియేషన్స్ అధికారకంగా ప్రకటించింది కూడా ...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories