తాత అయిన రామ్ గోపాల్ వర్మ

తాత అయిన రామ్ గోపాల్ వర్మ
x
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాతయ్య అయ్యారు. అయన కూతురు నిన్న ఉదయం 7:30 గంటలకు రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాతయ్య అయ్యారు. అయన కూతురు నిన్న ఉదయం 7:30 గంటలకు రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లోని ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపధ్యంలో టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తన సోషల్ మీడియా వేదికగా వర్మకు విషేస్ తెలిపారు..

" కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ... మీ మనవరాలు మిమ్మల్ని ఏలేంత గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? రాము తాతా, రాము నాన్న లేకపోతే గ్రాండ్‌పా రామూనా?" అని ట్వీట్ చేశారు రాజమౌళి.. మరి వర్మ దీనిపైన ఎలా స్పందిస్తాడో చూడాలి మరి..

ఇక వర్మ కూతురు అయిన రేవతి విషయానికి వస్తే.. ఆమె ప్రణవ్ అనే వైద్యుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వృత్తి రీత్యా రేవతి కూడా వైద్యురాలు కావడం విశేషం.. ఇక ఒక సమయంలో తన కూతురి కాపురం గురించి అర్జీవీ మాట్లాడుతూ.. నా కూతరు, అల్లుడు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే.. వారిని చూసి బోర్ కొట్టింది. ఎప్పుడైనా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే బాగుంటుంది అనిపిస్తుందని అని కామెంట్ చేశారు.

ఇక వర్మ తాజాగా బ్యూటిఫుల్ అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం వర్మ దిశా అనే సినిమాని తెరకేక్కిస్తునట్టుగా ప్రకటించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories