డాన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..

RGV Dance
x
RGV Dance
Highlights

సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఇప్పటికే సినిమా ట్రైలర్ , పోస్టర్స్ తో సినిమాకి ఎంత...

సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఇప్పటికే సినిమా ట్రైలర్ , పోస్టర్స్ తో సినిమాకి ఎంత పబ్లిసిటీ కావాలో అంత తెచ్చుకున్న వర్మ తాజాగా సినిమాకి సంబంధించిన రెండు పాటలను విడుదల చేసాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. దీనితో చిత్ర యూనిట్ పార్టీ చేసుకుంది. ఇందులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలోని పప్పు లాంటి అబ్బాయి అనే పాటకు డాన్స్ చేసాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పటికే వర్మ కేఏ పాల్ కి సంబంధించిన పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ట్రైలర్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన తాజా పరిణామాల చూట్టు సినిమా కథ నడుస్తుందని తెలుస్తుంది. సమకాలీన రాజకీయ అంశాలపై సినిమా తెరకెక్కుతుండడంతో సినిమా పైన వివాదాలు నెలకొన్నాయి. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల అయ్యాక మరెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి మరి..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories