వర్మ ట్వీట్ వైరల్.. బాలీవుడ్ సింగర్ ఫైర్!

వర్మ ట్వీట్ వైరల్.. బాలీవుడ్ సింగర్ ఫైర్!
x
Ram Gopal Varma, Sona Mahapatra (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్రం లాక్ డౌన్ సారైనా మార్గం అని భావించింది.

కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్రం లాక్ డౌన్ సారైనా మార్గం అని భావించింది. అందుకే ఇప్పటికే లాక్ డౌన్ ను మూడు సార్లు పొడిగించింది. అయితే మొదటి, రెండు విడతల లాక్ డౌన్ లో భాగంగా మద్యం ప్రియులకు నిరాశనే మిగిల్చింది కేంద్రం.. దీనితో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. చుక్క దొరకక అల్లడిపోయారు. కానీ తాజాగా మూడోవిడత లాక్ డౌన్ లో మాత్రం మద్యం షాపులు తెరచే వెసులుబాటు కల్పించింది.. దీనితో మద్యం ప్రియుల్లో ఎక్కడలేని ఆనందం నెలకొంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో నిన్న (సోమవారం) మద్యం షాపులు తెరుచుకున్నాయి.

దీనితో మందుబాబులు మద్యంషాపుల ముందు బారులు తీరారు. ఎండ అని చూడకుండా క్యూ లైన్స్ పాటించారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అందులోనుంచి ఓ ఫోటోను తీసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో. అవును పాపం తాగే పురుషుల నుంచి మహిళలను రక్షించడం చాలా ముఖ్యం"అంటూ ట్వీట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఇక వర్మ ట్వీట్ పై బాలీవుడ్‌ సింగర్‌ సోనా మెహపాత్రా స్పదించింది.. ''డియర్‌ మిస్టర్‌ ఆర్జీవీ. మీరు చేసిన ఈ ట్వీట్ ఎందుకు సెక్సిజం, మీ తప్పుడు నైతికత విలువలకు అర్థంగా నిలుస్తోంది. మహిళలకు, పురుషుల మాదిరిగా మద్యం కొనుగోలు, మద్యం సేవించే హక్కు ఉందనే విషయాన్ని గమనించండి. అయితే మద్యం సేవించాక హింసాత్మకంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు'' అంటూ కౌంటర్ వేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories