రాజమౌళి చేసిన పనికి నెటిజన్లు ఫిదా

రాజమౌళి చేసిన పనికి నెటిజన్లు ఫిదా
x
Highlights

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, పక్క దేశంకి వెళ్ళినా మన సంప్రదాయాలు ,పద్దతులను మాత్రం మర్చిపోలేదు. తాజాగా బాహుబలి సినిమాకి...

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, పక్క దేశంకి వెళ్ళినా మన సంప్రదాయాలు ,పద్దతులను మాత్రం మర్చిపోలేదు. తాజాగా బాహుబలి సినిమాకి సంబంధించిన లైవ్ కాన్సర్ట్‌ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. వీటికోసం రానా, ప్రభాస్, అనుష్క, రాజమౌళి, కీరవాణి ఇలా బాహుబలి టీం అందరూ తరలివెళ్లారు. అయితే అక్కడికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వచ్చారు.

కానీ దర్శకదీరుడు మాత్రం మన అచ్చు తెలుగు సాంప్రదాయ పద్ధతిలో అక్కడికి వెళ్ళాడు. రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో పంచెకట్టుతో దర్శనం ఇచ్చాడు. దీనితో రాజమౌళిని అలా చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. మన తెలుగోడు ఖ్యాతిని పెంచావని కామెంట్స్ పెడుతున్నారు. రాజమౌళి పంచెకట్టుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. బాహుబలి లాంటి భారీ హిట్టు తర్వాత జక్కన్న ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories