RRR తర్వాత రాజమౌళి RR?

RRR తర్వాత రాజమౌళి RR?
x
Rajamouli, Ram(RR)
Highlights

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ముందుగా సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి యంగ్ హీరో రామ్ తో మీడియం బడ్జెట్ సినిమాని చేసేందుకు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ చర్చలు కూడా సాగుతున్నాయని ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. బహుబలి, RRR లాంటి భారీ ప్రాజెక్ట్ లు కావడంతో రిలీఫ్ కోసం ఈ సినిమాని చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట! ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని ఇప్పటికే త‌న తండ్రిని ఆదేశించాడని స‌మాచారం. దీనిపైన పూర్తి సమాచారం త్వరలో రానుంది. ప్రస్తుతం రామ్ రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories