'డబల్ ఇస్మార్ట్' తో త్వరలోనే కలుద్దాం .. పూరి

డబల్ ఇస్మార్ట్ తో త్వరలోనే కలుద్దాం .. పూరి
x
Highlights

పూరి కింద పడడం కామనే కానీ ఎంత తొందరగ కింద పడతాడో అంతే తొందరగా లేస్తాడు ..తాజాగా హీరో రామ్ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద...

పూరి కింద పడడం కామనే కానీ ఎంత తొందరగ కింద పడతాడో అంతే తొందరగా లేస్తాడు ..తాజాగా హీరో రామ్ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుంది . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొత్తం 63 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినిమా నిర్మాత ఛార్మి చెప్పుకొచ్చారు . సినిమా యూనిట్ కూడా ఈ మధ్యనే సక్సెస్ మీట్ ని అరేంజ్ చేసింది . ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో సినిమా యూనిట్ విజయోత్సవ వేడుకలకు హాజరవుతూ సినిమా సక్సెస్ ని ఫాన్స్ తో కలిపి ఎంజాయ్ చేస్తున్నారు .

త్వరలో తెలంగాణాలో కూడా పర్యటించనున్నారు . అయితే దీనిపైన దర్శకుడు పూరి స్పందిస్తూ సినిమా సక్సెస్ కావాలని ఫస్ట్ టైం కోరుకున్నానని ఎక్కడికి వెళ్ళినా సినిమా హిట్టు హిట్టు అంటుంటే చాలా ఆనందంగా ఉందని , ఈ సినిమాకి సీక్వెల్ కావాలని ఫాన్స్ అడుగుతున్నారని , ఇప్పటికే ఈ టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసానని పూరి చెప్పుకొచ్చాడు . దానికి సంబంధించిన కథ కూడా రెడీ గా ఉందని , త్వరలోనే డబల్ ఇస్మార్ట్ తో కలుద్దామని పూరి చెప్పుకొచ్చాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories