Top
logo

Puri Jagannadh: స్వీటీ కాస్తా అనుష్కగా ఇలా మారింది : పూరి మైండ్ బ్లోయింగ్ స్పీచ్

Puri Jagannadh: స్వీటీ కాస్తా అనుష్కగా ఇలా మారింది : పూరి మైండ్ బ్లోయింగ్ స్పీచ్
X
puri Jagannath heart touching speech about anushka
Highlights

అనుష్క... ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు..అందం అభినయంతో ఆకట్టుకోగల నటి.. ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషలలో చిత్రాలలో కలిపి సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించింది

అనుష్క... ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు..అందం అభినయంతో ఆకట్టుకోగల నటి.. ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషలలో చిత్రాలలో కలిపి సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఒక అగ్ర కథానాయకుడికి ఉన్న క్రేజ్ ఈ అమ్మడికి ఉంది. హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలు అంటే చాలు దర్శకులకు ముందు అనుష్కనే గుర్తుకు వస్తుంది. ఈ స్వీటీతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడంలోనూ నిర్మాతలు వెనుకడుగు వేయ్యరు.

టాలీవుడ్ లో అనుష్క ప్రస్థానం చూస్తే.. 2005 సంవ‌త్స‌రంలో పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' చిత్రం తో అనుష్క తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అయింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'అరుదంతి' చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకుంది. ఇక విక్రమార్కుడు, మిర్చి, లక్ష్యం మొదలగు చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి. ఇక బాహుబలి, రుద్రమదేవి సినిమాలు ఆమెని స్టార్ హీరోయిన్ లలో ఒకరిని చేశాయి. ఇలా అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదిహేనేళ్ళయింది. ప్రస్తుతం నిశబ్దం అనే సినిమాలో నటిస్తోంది. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుకకి రాఘవేంద్రరావు, రాజమౌళి, పూరి జగన్నాధ్, వైవి యస్ చౌదరి, చార్మీ మొదలగువారు హాజరయ్యారు..

ఈ సందర్భంగా దర్శకుడు పూరీజగన్నాధ్ మాట్లాడుతూ.. 'సూప‌ర్' సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లిన‌ప్పుడు స్వీటీ దొరికింది. అక్కడి నుంచి అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. స్వీటీని నాగార్జున‌గారు చూడ‌గానే, 'ఈ అమ్మాయ్ చాలా బాగుందే' అని ఆడిషన్స్ లేకుండానే సినిమాలో పెట్టేద్దామని అన్నారు. ఆ తర్వాత అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల ద‌గ్గ‌ర యాక్టింగ్ నేర్చుకుంది. ఈ సినిమా జరుగుతున్నప్పుడు నాగార్జున‌గారు స్వీటీని పేరు అడగగా, స్వీటీ అని చెప్పింది. 'కాదు, నీ ఒరిజిన‌ల్ పేరు?' అన‌డిగారు. స్వీటీయేన‌ని, త‌న పాస్‌పోర్ట్ చూపించింది..

కానీ ఇదికాకుండా ఇంకేదో పేరు పెట్టాలని నాగర్జున గారు, నేను చాలా అనుకున్నాం... అప్ప‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌతా 'మిల మిల' అనే పాట రికార్డింగ్ కోసం అనుష్క అనే అమ్మాయిని పిలిపించాడు. అది నాకు న‌చ్చి అనుష్క పేరు ఎలా ఉందని అడిగితే, మ‌న హీరోయిన్ల‌లో ఎవ‌రికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చ‌న్నారు. అలా అనుష్క అనే నామ‌క‌ర‌ణం జ‌రిగిందని,అలా సూపర్ సినిమాతో అనుష్క పేరు స్క్రీన్ పైకి వచ్చిందని పూరి చెప్పుకొచ్చాడు. ఇక అనుష్క చాలా మంచిదని, త‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకోవాలని పూరి వెల్లడించాడు.

ప్రస్తుతం అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న 'నిశ్శ‌బ్దం' ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Web Titledirector puri Jagannadh heart touching speech at 15 years for Anushka Shetty Event
Next Story