ఆ సినిమాకి నీ పేరు వేసుకోకు అన్నారు : మారుతి

ఆ సినిమాకి నీ పేరు వేసుకోకు అన్నారు : మారుతి
x
Maruthi
Highlights

ఈరోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు మారుతి. ఆ తర్వాత బస్ స్టాప్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు

ఈరోజుల్లో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు మారుతి. ఆ తర్వాత బస్ స్టాప్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మెగా మేనల్లుడు సాయి తేజ్ తో ప్రతి రోజూ పండగే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నీ అందుకుంది. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మారుతి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగా 'ప్రేమకథా చిత్రం' సినిమాను గురించి ప్రస్తావిస్తూ " ప్రేమకథా చిత్రం' సినిమాకి నేనే దర్శకత్వం వహించాను. అయితే ముందుగా ఈ సినిమాను చూసినవాళ్లు ఇదేం సినిమా అని మా మాట విని నీ పేరు వేసుకోకు అని, మీ కెమెరా మేన్ పేరు వేసేయి అని చెప్పారు. లేకపోతే అప్పటివరకూ నువ్వు చెప్పకపోతే సంపాదించుకున్న క్రేజ్ పోతుందని " అన్నారు.

దీనితో భయపడి ఆ సినిమాకి దర్శకుడిగా మా కెమెరామెన్ పేరు వేశానని చెప్పుకొచ్చాడు. కానీ సినిమాపైన నమ్మకం మాత్రం ఉందని, అందుకే ఇది మారుతి సినిమా అంటూ ప్రమోషన్ చేశామంటూ చెప్పుకొచ్చాడు. అనుకున్నట్టుగానే సినిమాకి మంచి పేరు వచ్చి హిట్ అయిందని అన్నాడు. దీనివల్ల కొత్తదనం వున్న సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం అయితే వచ్చిందని అన్నాడు.

ఈ సినిమాలో సుధీర్ బాబు, నందిత కలసి నటించారు. హర్రర్ కామెడిగా తెరక్కెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్నీ అందుకుంది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రేమకథా చిత్రమ్ 2 సినిమా విడుదల అయింది.కానీ అనుకున్నంతగా విజయాన్నీ అందుకోలేకపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories