మరో మెగా హీరోతో దర్శకుడు మారుతి

మరో మెగా హీరోతో దర్శకుడు మారుతి
x
Highlights

చిన్న సినిమాలు చేస్తూ పెద్ద హిట్టు కొట్టడం ఎలాగో తెలిసిన దర్శకులలో మారుతి ఒకరు. కెరియర్ మొదట్లో యూత్ ని టార్గెట్

చిన్న సినిమాలు చేస్తూ పెద్ద హిట్టు కొట్టడం ఎలాగో తెలిసిన దర్శకులలో మారుతి ఒకరు. కెరియర్ మొదట్లో యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీసిన మారుతి ఆ తర్వాత తన పంధా మార్చుకొని కుటుంబ నేపధ్యంలో సాగే సినిమాలు తీసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే గత ఏడాది మెగా హీరో సాయి ధరమ్ తేజు తో చేసిన ప్రతిరోజూ పండగే సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ పిల్లలు తమని ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లితండ్రులను మరిచిపోతున్నారన్న నేపధ్యంలో చక్కటి కుటుంబ సన్నివేశాలతో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఈ సినిమాకి కేవలం అభిమానులు మాత్రమే కాదు సినీ పరిశ్రమలోని పలువురు బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ మారుతికి మంచి ఆఫర్స్ ని తెచ్చిపెడుతున్నాయి.

అయితే మారుతి తన తదుపరి చిత్రం మెగా హీరోతోనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు శిరీష్ తో కొత్తజంట, సాయి ధరమ్ తేజు తో చేసిన ప్రతిరోజూ పండగే సినిమాలని చేసిన మారుతి తదుపరి చిత్రాన్ని వరుణ్ తేజ్ తో చేస్తున్నాడని తెలుస్తుంది. గత ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మంచి హిట్టు కొట్టిన వరుణ్ తో ఓ సినిమాని చేసేందుకు మారుతి సిద్దం అయ్యాడని తెలుస్తుంది.

ఇప్పటికే వరుణ్ , మారుతిల మధ్య కథ చర్చలు జరిగాయని సమ్మర్ లో సినిమా పట్టలేక్కనుందని సమాచారం . ఈ సినిమాకి కూడా గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ వారే నిర్మతాలుగా వ్యవహరించనున్నారట. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం వరుణ్ బాక్సర్ నేపధ్యంలో ఉన్న ఓ కథను చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories