మహేష్‌తో.. హ్యట్రిక్ కొడుతా ... సినిమా భారీ స్థాయిలో ఉంటుంది : కొరటాల శివ

మహేష్‌తో.. హ్యట్రిక్ కొడుతా ... సినిమా భారీ స్థాయిలో ఉంటుంది : కొరటాల శివ
x
Mahesh babu, koratala siva
Highlights

కొరటాల శివ.... టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఓటమి ఎరుగని దర్శకుడు.. చేసినవి నాలుగే నాలుగు సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ ప్లేస్ లోకి చేరుకున్నాడు.

కొరటాల శివ.... టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఓటమి ఎరుగని దర్శకుడు.. చేసినవి నాలుగే నాలుగు సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ ప్లేస్ లోకి చేరుకున్నాడు.. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కొరటాల శివ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఆచార్య సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడని రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన కొరటాల స్పందించాడు. " సినిమాలో రామ్ చరణ్ ను ఓ పాత్రకోసం అనుకున్నాం.. ఇదే విషయాన్నీ చిరంజీవికి చెప్పగా ఒకే అన్నారు. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'లో నటిస్తున్నారు కాబట్టి దాన్నిబట్టి ప్లాన్‌ చేసుకుందామనుకున్నా. కానీ ఆ సినిమా వాయిదా పడింది. 'ఆచార్య' విడుదల కూడా వచ్చే ఏడాదనే ప్రచారం మొదలైంది. దాంతో లోపల చిన్న టెన్షన్‌ మొదలైంది. ఈ హడావుడి మధ్యలోనే అనుకోకుండా మహేష్‌బాబుతో మాట్లాడాను..

అప్పుడు నా టెన్షన్‌ చూసి నేనున్నానని మహేష్ గొప్ప మాట అన్నారు. ఆ మాట విని షాకయ్యా. మహేష్‌ లాంటి హీరో ఆ మాట అన్నాక ఎంత ధైర్యం వస్తుంది! ఆ ఆనందంలో ఇదే విషయాన్ని కొందరితో పంచుకున్నా. కానీ దీనినే రకరకాలుగా వార్తలుగా రాశారు. కానీ మహేష్ తో కచ్చితంగా సినిమా ఉంటుంది. ఆ సినిమాతో హ్యట్రిక్ కొడుతాం ... సినిమా భారీ స్థాయిలో ఉంటుందని కొరటాల ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories