Top
logo

RRR: మాట తప్పిన రాజమౌళి.. కొరటాల శివ ఆసక్తికర ట్వీట్

RRR: మాట తప్పిన రాజమౌళి.. కొరటాల శివ ఆసక్తికర ట్వీట్koratala Siva
Highlights

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం)..

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సినిమా టైటిల్ లోగో ని రిలీజ్ చేస్తూ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన వీడియో ఈరోజు ఉదయం 10 గంటలకి విడుదల చేస్తామని అఫీషియల్‌గా ప్రకటించారు.

అయితే సాంకేతిక కారణాల వలన ఈ రోజు ఉదయం 10 గంటలకి విడుదల కావాల్సిన స్పెషల్ వీడియోను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపైనా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "మీరు ఇలాగే లేట్ చేయండి.. మా బాస్ మా 'ఆచార్య' సినిమా టైటిల్‌ని లీక్ చేసినట్టే తుర్.. మని వీడియో వదిలేస్తారు ఎవ్వరికీ చెప్పకుండా" అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు కొరటాల.. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వెంటనే డిలీట్ చేశారు.

పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Web TitleDirector koratala Siva funny tweet on RRR movie video delay
Next Story


లైవ్ టీవి